Pimples | మొటిమలు రాకుండా ఆపలేమా? వచ్చాక వదిలించుకోలేమా?
Pimples | నిజమే, మొటిమలు చర్మ సౌందర్యానికి శత్రువులు. అలా అని వాటిని తలుచుకుని భయపడాల్సిన పన్లేదు. మొటిమలకు అనేక కారణాలు. వయసు, హార్మోన్ సమస్యలు, ఆహారం, ఒత్తిడి, రోజూ తీసుకునే ఔషధాలు.. ఎటు నుంచి అయినా రావచ్చు. సాధారణంగా మొటిమలు వాటంతట అవే మానిపోతాయి.
Pimples | మొటిమలు ఎందుకొస్తాయి? రాకుండా ఆపలేమా? వచ్చాక వదిలించుకోవడం కష్టమా? నా సందేహం తీర్చండి ప్లీజ్!
– ఓ పాఠకురాలు
నిజమే, మొటిమలు చర్మ సౌందర్యానికి శత్రువులు. అలా అని వాటిని తలుచుకుని భయపడాల్సిన పన్లేదు. మొటిమలకు అనేక కారణాలు. వయసు, హార్మోన్ సమస్యలు, ఆహారం, ఒత్తిడి, రోజూ తీసుకునే ఔషధాలు.. ఎటు నుంచి అయినా రావచ్చు. సాధారణంగా మొటిమలు వాటంతట అవే మానిపోతాయి. కాకపోతే కొన్నిసార్లు చర్మం మీద మచ్చలు ఏర్పడతాయి. దీన్నే.. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అని పిలుస్తారు. ఆ నల్లని గుర్తులు మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. మెలనిన్ అనే రసాయనం మోతాదుకు మించి ఉత్పత్తి కావడం వల్ల చర్మం ఇలా నల్లబారుతుంది.
ఇలాంటి సందర్భాల్లో అసహనానికి గురికాకూడదు. మొటిమలను గిల్లుకుంటే చర్మానికి మరింత నష్టం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు నూనె పదార్థాలు తినడం తగ్గించుకోవాలి. మొహం తుడుచుకోడానికి వాడే తువ్వాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దిండు కవర్ రోజూ మార్చడం ఉత్తమం. చికిత్స విషయానికొస్తే, పరిస్థితిని బట్టి నిపుణులే తగిన వైద్యాన్ని నిర్ణయిస్తారు. మొదట మొటిమల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా క్రీమ్ సిఫారసు చేస్తారు. ఆ తర్వాత మచ్చలను వదిలించడానికి పైపూత మందులు ఇస్తారు. సమస్య తీవ్రతను బేరీజువేసి లేజర్, కెమికల్ పీల్, మైక్రోడెర్మాబ్రేషన్ తదితర ఆధునిక విధానాలను ఎంచుకుంటారు. సమస్య రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలా మంచిది.
డాక్టర్ అనున్యా రెడ్డి
ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- Acne
- beauty tips
- pimples
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

