HomeBeauty-tipsHow To Prevent Hair Loss Problems In Hot Summer Season
Hair fall | సమ్మర్‌లో ఎక్కువగా జుట్టు రాలుతుందా? మీ సమస్యకు ఇలా చెక్ పెట్టండి
ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. ఒకరు మంచిదని చెబుతారు. ఒకరు ప్రమాదకరమని హెచ్చరిస్తారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని విస్మరించాలి? ఆరోగ్యకరమైన కేశాల కోసం ఆరాటపడేవారిని వేధిస్తున్న ప్రశ్నలివి. ప్రతి ప్రశ్నకూ శాస్త్రీయమైన జవాబు ఉంది..
2/5
బయటికి వెళ్లామంటేనే.. కాలుష్యంలో తల పెట్టినట్టే. దుమ్ము, ధూళి చేరిపోతుంది. చెమట కారిపోతుంది. జిడ్డు పేరుకుపోతుంది. తలస్నానం చేయడమే మంచిది. కాకపోతే, నాణ్యమైన షాంపూ వాడితే చాలు.
3/5
నూనె పట్టించకూడదు : కారు ప్రయాణికుడికి సీట్‌బెల్ట్‌లా, బైక్ రైడర్‌కు హెల్మెట్‌లా.. జుట్టుకు నూనె. దీనివల్ల రక్షణ లభిస్తుంది. మెరుపు వస్తుంది. నూనెలోని ఫ్యాటీయాసిడ్స్.. వెంట్రుకలు కోల్పోయిన లిపిడ్స్‌ను భర్తీ చేస్తాయి.
4/5
కత్తిరించుకున్న కొద్దీ పెరుగుతుంది : గుండు చేయించుకుంటే జుట్టు పెరుగుతుందని అంటారు. తరచూ కత్తిరించినప్పుడు మొక్క చిగురించినట్టు, జుట్టు కూడా కొత్తగా మొలుస్తుందని ఊదరగొడతారు. ఇవన్నీ అబద్ధాలే. వెంట్రుకలు చిట్లిపోవడం మాత్రం కొంతమేర తగ్గుతుంది.
5/5
వేసవిలో ఎక్కువగా రాలుతుంది : ఇది కూడా అపోహే. నిజానికి మిగతా సీజన్‌లతో పోలిస్తే వేసవిలో జుట్టు పెరుగుదల పది నుంచి పదిహేను శాతం వేగవంతం అవుతుంది. కాకపోతే, దానికి మనవంతు మద్దతు అందించాలి. మండుటెండలో వెళ్లినప్పుడు టోపీ పెట్టుకోవాలి.
6/5
షాంపూ మారుస్తూ ఉండాలి : అలా అని కచ్చితంగా చెప్పలేం. కానీ మనం ఎంచుకునే షాంపూలో రసాయనాలు నామమాత్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆర్గానిక్ షాంపూ అయితే మరీ మంచిది. అందులోనూ పారాబెన్స్, సల్ఫేట్స్ శాతం ఎంత తగ్గితే అంత మంచిది.