Apps:
Follow us on:

Beauty Tips | పెదవులు గులాబీ రంగులో మెరవలా? ఈ టిప్స్‌ మీకోసమే..!

1/7కొంతమంది ఎన్ని లిప్‌స్టిక్స్‌ పూసుకున్నా సరే పెదవులు అందవిహీనంగానే కనిపిస్తూనే ఉంటాయి. ఎన్ని క్రీములు రాసినా కూడా పెదవులు పగులుతూనే ఉంటాయి. అలాంటి వారు ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
2/7రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
3/7గుప్పెడు గులాబీ రేకుల్ని ముద్దగా చేసుకుని దానికి చెంచా వెన్న కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల బాదం నూనె చేర్చి పెదాలకు రాసుకుంటే మృదువుగా కనిపిస్తాయి.
4/7తేనె పంచదార ఆలివ్ ఆయిల్‌ల మిశ్రమాన్ని పెదాలకు రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలిగిపోతాయి.
5/7కొందరి పెదవులు నలుపు రంగులో ఉన్నాయని బాధపడుతుంటారు. బీట్‌రూట్ రసాన్ని ఉదయాన్నే పెదాలకు రాసుకుంటే పెదాలు మృదువుగా తయారవుతాయి. ఇలా కొన్ని రోజులు చేస్తే పెదాలపై ఉన్న నలుపు రంగు తొలిగిపోతుంది. పెదాల పగుళ్లు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
6/7పెదవులు మరింత అందంగా కనిపించాలంటే క్రీములు, మర్దన నూనెలు రాసుకుంటే సరిపోదు. వీలైనప్పుడల్లా కొత్తిమీర, పుదీనా, క్యారెట్ జ్యూసులు తాగుతుండాలి. వీటివల్ల చర్మానికి కొత్త కాంతి వస్తుంది.
7/7ఆకుకూరలు తినడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పెదాలు పగులకుండా ఉంటాయి.