ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు అమ్మాయిల అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వాటిని పోగొట్టుకునేందుకు యువతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మొటిమలను పోగొట్టుకునేందుకు రసాయనాలతో తయారు చేసిన క్రీములతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే వస్తువులతో ముఖంపై మచ్చలను పోగొట్టుకుని చర్మం మెరిసిపోయేలా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ముఖంపై మచ్చలను ఆలుగడ్డలు పోగొడతాయి. ఆలుగడ్డలను ముక్కులుగా చేసి మచ్చలు ఉన్న చోట ఉంచాలి. కాసేపు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆలుగడ్డలను గుజ్జుగా చేసి.. అందులో టీస్పూన్ తేనె కలిపి మచ్చలు ఉన్న చోట రాసి పావుగంట వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం ద్వారా ముఖంపై మచ్చలుపోతాయి.
మజ్జిగలో కొంత టొమాటో రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది. వారంలో రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
ఒక టేబుల్ స్పూన్ పెరుగులో కొంచెం నిమ్మరసం కలిపి.. మచ్చలు ఉన్న చోట పూస్తే కూ మచ్చలు పోయి చర్మం మెరిసిపోతుంది.
ఓట్స్‌ను గ్రైండ్ చేసి కొంచెం నిమ్మరసం వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. దాన్ని ముఖంపై మర్దనా చేసుకోవాలి. పావు గంట తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. వారంలో ఒకటి రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
ఓట్స్‌ను గ్రైండ్ చేసి కొంచెం నిమ్మరసం వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. దాన్ని ముఖంపై మర్దనా చేసుకోవాలి. పావు గంట తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. వారంలో ఒకటి రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
మచ్చలు ఉన్న చోట అలోవెరాను పూసి మసాజ్ చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే కొన్ని వారాల్లోనే మచ్చలు మాయమవుతాయి.
బొప్పాయిని గుజ్జుగా చేసి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.