సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 31, 2020 , 00:24:31

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పాభిషేకం

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పాభిషేకం

పాల్వంచ రూరల్‌: మండలంలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో గురువారం శ్రీపంచమి సందర్భంగా ఆలయ ఆవరణలో ఉన్న సరస్వతీ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం అర్చకులు అమ్మవారికి గణపతి పూజ, సరస్వతి పూ జలు నిర్వహించి బాలలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిపారు. పూజా కార్యక్రమాలకు హ జరైన 21 మంది బాలలకు ఆలయం తరుపు నుంచి పలక, బలపం, పుస్తకాలు, పెన్నులు అం దించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద యం ఆలయంలోని అమ్మవారికి సువర్ణపుష్పాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అమ్మవారికి అభిషేకం జరిపి పూజా కార్యక్రమాల్లో భాగంగా  హారతి, మంత్రపుష్పం, నివేదనను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.