YS Sharmila | ఓటరు తీర్పును గౌరవిస్తున్నాం.. ప్రజలపక్షాన నిలబడతాం : వైఎస్ షర్మిల
YS Sharmila | ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు తన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఆమె ఒక పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు.
YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు తన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఆమె ఒక పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఆ పోస్టులో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తన ఎక్స్ పోస్టులో షర్మిల ఏమని రాసుకొచ్చారంటే.. ‘మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తికావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రజలు ఇచ్చిన ఇంతపెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగువేయాలో ఆలోచన చేసి వేయండి’ అని షర్మిల పేర్కొన్నారు.
‘రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, కేంద్ర సర్కారు ప్రత్యేక హోదా కోసం హామీ ఇస్తేనే, అన్ని విభజన హామీలకు కట్టుబడి ఉంటేనే, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ.. ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది’ అని ఎక్స్ పోస్టులో వైఎస్ షర్మిల తెలిపారు.
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి.…— YS Sharmila (@realyssharmila) June 5, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

