Devaragattu | దేవరగట్టులో కర్రల సమరం.. ప్రమాదవశాత్తు యువకుడు మృతి
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం (Bunny Utsavam) ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
దేవరగట్టు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం (Bunny Utsavam) ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అంనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలడ్డారు. తరతరాలు వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరిగిన ఈ కర్రల సమరంలో (Karrala Samaram) పెద్దఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు. ఓ చేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలు.. మది నిండా భక్తిభావంతో డిర్ర్ర్.. గోపరాక్.. అనే శబ్దాలతో దేవరగట్టు మారుమోగింది.

దేవతా మూర్తుల కోసం నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. పలువురు విచక్షణారహితంగా కొట్టుకుకోవడంతో సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఆలూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.

కాగా, బన్సీ ఉత్సవంలో ప్రమాదం చోటుచేసుకున్నది. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు సమీపంలోని చెట్టుపైకి ఎక్కారు. ప్రమాదవశాత్తూ అది విరిగిపడటంతో గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరికొదరు గాయపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

