సవాంగ్‌ను ఎందుకు తప్పించారు: ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ప్రశ్న
సవాంగ్‌ను మార్చడంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సవాంగ్‌ను అంత అకస్మాత్తుగా తప్పించాల్సిన అవసరం ఏంటని పవన్ కల్యాణ్.. తగిన శాస్తే జరిగిందని సీపీఐ నేత నారాయణ...
విజయవాడ: డీజీపీ పదవి నుంచి ఆల్ ఆఫ్ సడెన్‌గా గౌతమ్ సవాంగ్‌ను తప్పించడం రాష్ట్రంలో చర్చకు దారితీసింది. గౌతమ్ సవాంగ్ బదిలీ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయన స్థానంలో రాజేంద్రనాథ్‌రెడ్డిని నియమించింది. కాగా సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సవాంగ్‌ను మార్చడంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సవాంగ్‌ను అంత అకస్మాత్తుగా తప్పించాల్సిన అవసరం ఏంటని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తుండగా.. ఆయనకు తగిన శాస్తి జరిగిందని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు.
మంగళవారం మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఉన్న పళంగా బాధ్యతల నుంచి తప్పించడం విస్మయం కలిగించిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అధికారులను నియమించుకోవడం ప్రభుత్వానికున్న పాలనాపరమైన అధికారమని, అయితే, ఇదే సమయంలో డీజీపీని ఇంత హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇలాఉండగా, గౌతమ్ సవాంగ్‌కి తగిన శాస్తే జరిగిందని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. ఉన్నత స్థాయి అధికారులు పాలక వర్గం ఏం చెప్తే అది చేయాలని భావిస్తే ఫలితం ఇలాగే ఉంటుందన్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ వంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని చెప్పారు. తప్పులు చేసి విధేయత చూపించడం అధికారులకు అలవాటుగా మారిందని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

