Vizag Beach | విశాఖ బీచ్‌లో మళ్లీ నల్లగా మారిన ఇసుక.. స్థానికులు, పర్యాటకుల్లో ఆందోళన
Vizag Beach | విశాఖ ఆరే బీచ్‌లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
Vizag Beach | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): విశాఖ ఆరే బీచ్‌లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇసుకలో ఉండే లైట్,హెవీ మినరల్స్ విడిపోవడం వల్లే తీరం నల్లగా మారిందని అంటున్నారు. వాతావరణ మార్పులతో అలల ఉధృతి పెరిగినప్పుడు తీరంలో ఉండే లైట్ మినరల్స్ నీటితోపాటు సముద్రం లోపలకు వెళతాయట.
హెవీ మినరల్స్ తీరంలోనే ఉండిపోతాయట. బరువుగా ఉండే ఈ మినరల్స్‌లో ఎకువగా ఇలమనైట్, రుటైల్, జింకాన్, గార్నెట్, సిలిమినైట్ వంటివి ఉంటాయని చెబుతున్నారు. బీచ్ నల్లగా మారడానికి ప్రధానంగా ఇలమనైట్, రుటైల్ వంటి హెవీ మినరల్స్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు నల్లగా ఉండటం వల్లే తీరమంతా ఆ రంగులోకి మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. బీచ్‌లో ఇసుక రంగు నల్లగా మారడంతో పర్యాటకులతో పాటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రాంతం ఇలా కావడం చర్చనీయాంశమైంది. అయితే స్థానికులు మాత్రం విశాఖలో మొత్తం 10 ప్రాంతాల్లో డ్రైన్ వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే బీచ్ అందం మొత్తం పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో కూడా సరిగ్గా ఇలాగే సముద్ర తీరం మొత్తం నల్లగా మారిపోయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

