Vizag Beach | వైజాగ్ బీచ్‌లో మళ్లీ నల్లగా మారిన ఇసుక.. ఇలా ఎందుకు జరుగుతుంది?
Vizag Beach | విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్‌లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు వైజాగ్ బీచ్‌కు చేరుకుని సరదాగా కాలక్షేపం చేసే ప్రజలు.. నల్లగా మారిన ఇసుకను చూసి బెంబేలెత్తిపోతున్నారు.
Vizag Beach | విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్‌లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు వైజాగ్ బీచ్‌కు చేరుకుని సరదాగా కాలక్షేపం చేసే ప్రజలు.. నల్లగా మారిన ఇసుకను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో కాలుష్యం కారణంగానే ఇసుక నల్లగా మారుతుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. స్థానికులు మాత్రం విశాఖలో మొత్తం 10 ప్రాంతాల్లో డ్రైన్ వాటర్ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే బీచ్ అందం మొత్తం పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగు మారడానికి కారణమిదేనా?
వాస్తవానికి విశాఖపట్నంలోని సముద్రతీరం ఇలా ఇసుక నల్లగా మారడం ఇది కొత్తేమీ కాదు. గత ఏడాది రాఖీ పౌర్ణమి తర్వాత ఆగస్టు 11వ తేదీన కూడా ఇలాగే జరిగింది. దీంతో వైజాగ్ బీచ్‌కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమోనని అంతా హడలెత్తిపోయారు. కానీ ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదని అప్పుడే శాస్త్రవేత్తలు సూచించారు. ఏ తీర ప్రాంతంలో అయితే ఇనుప ధాతువు ఎక్కువగా కలిగి ఉంటాయో అక్కడ ఇసుక నల్లగా మారుతుందని ఆంధ్రా యూనివర్సిటీ సముద్ర గర్భ అధ్యయన శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫైసర్ ప్రసాదరావు గతంలో వివరించారు. వందల ఏళ్లుగా తీరం నుంచి కొట్టుకొచ్చిన ఎర్రని మట్టి, ఇసుకతో మేటలు వేసి భీమిలి సమీపంలోని ఎర్రదిబ్బలు ఏర్పడినట్లే.. ఇక్కడ నల్లటి మేటలు వేస్తుందని.. అయితే ఈ ఇసుక చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి అలలే ఆ మట్టిని మళ్లీ సముద్రంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలు, ఖనిజాల గనులు ఉన్నా కూడా తీరంలోని ఇసుక ఆయా రంగులను సంతరించుకుంటుందన్నారు. కాబట్టి విశాఖ బీచ్‌లో ఇసుక నల్లగా మారడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

