TTD Temple | నవీ ముంబాయిలో టీటీడీ ఆలయానికి భూమిపూజ
TTD Temple | టీటీడీ ఆధ్వర్యంలో నవీ ముంబాయి(Navi Mumbai)లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నవీ ముంబాయి(Navi Mumbai)లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేందర్ పడ్నవిస్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మహా ప్రభుత్వం కేటాయించిన సుమారు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయానికి రేమాండ్ గ్రూప్ సీఎండీ గౌతం హరి సింఘానియా 60 నుంచి 75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ముంబాయి వాసుల సుదీర్ఘ కాల నెరవేరనుందని పేర్కొన్నారు. తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లలేని భక్తులకు నవీ ముంబాయిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం ఎంతగానో ఉపయోగ పడుతుందని వెల్లడించారు. ఆలయం నిర్మాణంలో తమ వంతు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు.
టీటీడీ చైర్మన్(TTD Chairman) వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఉన్నమాదిరిగా నవీ ముంబాయిలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. పుష్కరిణీ, అలంకార మండపం, రథ మండపం, వాహన మండపం, మాఢ వీధులను నిర్మించి రెండు సంవత్సరాల్లో ఆలయాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మిలింద్ నర్వేకర్, అమోల్ కాలే, రాజేశ్ శర్మ, సౌరభ్ బోరా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

