TTD | 16న తిరుమలలో ఘనంగా రథసప్తమి.. టీటీడీ విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
తిరుమల: ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రథసప్తమి (Ratha Saptami) సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. వాహనసేవలను వీక్షించేందుకు మాఢ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుంచే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సును నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేయనున్నారని తెలిపారు. పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
శ్రీవారి భక్తులు నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదని ఈవో సూచించారు. టీటీడీ ఐటీ విభాగం 52 నకిలీ వెబ్సైట్లను, 13 నకిలీ మొబైల్ యాప్లను గుర్తించిందని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.inలో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

