జూలై నెలాఖరు వరకు ఏకాంతంగా శ్రీవారి ఆర్జిత సేవలు
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగానే ఆర్జిత సేవలు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగానే ఆర్జిత సేవలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా, కరోనా కేసులు తగ్గిపోవడంతో ఏప్రిల్ 1న శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించింది. అదేవిధంగా సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్ల సంఖ్యను పెంచింది. దీంతో వేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, శనివారం శ్రీవారిని 76,324 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Arjitha sevas
- July
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

