TTD | రూ.5వేలకోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్.. ఆమోదం తెలిపిన బోర్డు..
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదించింది. ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు, హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు కేటాయించారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదించింది. ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు, హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు కేటాయించారు. వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, పలు వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు, పారిశుధ్య విభాగానికి రూ.261.07 కోట్లు, నిఘా- భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు కేటాంచారు.
ఆదాయం అంచనాలో శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 1,611 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.1,167 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు, కల్యాణకట్ట రసీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం బాడుగల ద్వారా రూ.147 కోట్లు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల విక్రయాల ద్వారా రూ.448 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.
ఇదిలా ఉండగా.. లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ.15 వేలు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ.34 వేల నుంచి రూ.54 వేలకు పెంచారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పని చేసేందుకు కొత్త పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నట్లు పాలకమండలి చైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు 57 మంది మరాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారని తెలిపారు. సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని భూమన వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

