ఎల్లుండి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనం.. కొవిడ్ రూల్స్ తప్పనిసరి
శ్రీశైలం | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.

శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ప్రతిరోజు గర్భాలయంలో ఏడు విడతలుగా అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయని స్పష్టం చేశారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు ఈఓ వివరించారు. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. స్వామివార్ల స్పర్శదర్శనం, ఆర్జిత సేవలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించి భక్తులు ఆలయ అధికారులకు సహకరించాలని ఈఓ కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

