తిరుమల: సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల ఆలయాన్ని రెండు రోజుల పాటు అధికారులు మూసివేయనున్నారు. అక్టోబర్ 25, నవంబర్ 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నా రు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ రెండు రోజుల్లో ఆలయాలను మూసివేస్తున్న అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇవాళ తిరుమలలో 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. నిన్న శ్రీవారిని 70,328 మంది భక్తులు దర్శించుకోగా 29,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.46 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.