Tirumala | తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది.
తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోగా కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు బారులు తీరి ఉన్నారు.
నిన్న స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకోగా 51,251 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

సింహవాహనంపై గోవిందరాజ స్వామి దర్శనం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahamotsavam) మూడోరోజు ఆదివారం శ్రీ గోవిందరాజస్వామి సింహ వాహనంపై దర్శనమిచారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తలు కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ జరిగింది.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం ఊంజల్‌సేవను, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

