Road Accident | లారీ-కారు-టాటా ఏస్ ఢీ.. ముగ్గురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సిమెంట్ రెడీమిక్స్ వాహనం.. పెదకాకానిలోని అమెరికన్ అంకాలజీ క్యాన్సర్ దవాఖాన వద్ద చెడిపోయింది. దీంతో డ్రైవర్ దానిని రోడ్డుకు కుడివైపున నిలిపాడు. అయిదే దానిని గమనించకుండా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో రెడీమిక్స్ వాహనం రోడ్డు మధ్యకు జరిగింది. అదే సమయంలో వెనుక నుంచి కూలీలతో వస్తున్న టాటాఏస్ మినీ ట్రక్ దానిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులను కే.రాంబాబు, తేజ, మధుగా గుర్తించామన్నారు. వీరంతా డెకరేషన్ పనుకు వెళ్లివస్తున్న కూలీలని చెప్పారు. గాయపడిన వారిని జీజీహెచ్‌కు తరలించామన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

