రెచ్చిపోయిన దొంగలు : బ్యాంకుకు కన్నం వేసి భారీగా నగదు చోరీ
Thieft | గుంటూరులో సినీఫక్కీలో దొంగలు బ్యాంకుకు కన్నం వేసి భారీగా నగదు కొల్లగొట్టారు. నగరంలోని గాంధీపార్క్ వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.

గుంటూరు : గుంటూరులో సినీఫక్కీలో దొంగలు బ్యాంకుకు కన్నం వేసి భారీగా నగదు కొల్లగొట్టారు. నగరంలోని గాంధీపార్క్ వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీకి పక్కాగా ప్రణాళిక వేసిన దొంగలు ఆదివారం రాత్రి చాకచక్యంగా బ్యాంకులోని ప్రవేశించి గ్యాస్ కట్టర్‌తో లాకర్ కట్ చేశారు. లాకర్లోని దాదాపు రూ. 25 లక్షల నగదును అపహరించారు. బ్యాంకు దోపిడీ చేసేందుకు ముందుగానే పతకం పన్నినట్లు దొంగతనం చేసిన తీరును పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. బ్యాంకు లోపల సీసీ కెమెరాలను ధ్వంసం చేసి స్ట్రాంగ్‌రూంకు రంధ్రం చేసి లాకర్లను పగులగొట్టినట్లు తెలిసింది. ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్‌టీం ఆధారాలు సేకరించాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

