అమరావతి : విజయసాయి రెడ్డిని ( Vijayasai Reddy) ఎవరు క్షమించినా తాను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. వైఎస్ జగన్, సాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా ఇది. జగన్‌కు అంతా తెలిసే జరుగుతుందని , ఉన్న కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న రాజీనామా నాటకమని ట్విటర్లో (Twitter) ఆరోపించారు.
జగన్ రెడ్డి, @VSReddy_MP కలిసి ఆడుతున్న డ్రామా ఇది..! @ysjagan కి తెలిసే అంతా జరుగుతుంది.. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా..!
చంద్రబాబు గారితో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు.. విజయసాయి రెడ్డి చంద్రబాబు గారిని అన్న ప్రతి…— Budda Venkanna (@BuddaVenkanna) January 25, 2025
చంద్రబాబుతో (Chandra babu) వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. తమ నాయకుడిపై అన్న ప్రతి మాట మాకు ఇంకా గుర్తు ఉందని పేర్కొన్నారు. చేసినవి అన్ని చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరని అన్నారు. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలని పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి దేశం విడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వవద్దని ట్విటర్లో కోరారు. చంద్రబాబును, వారి కుటుంబాన్ని అన్న మాటు ఎవరూ మరిచిపోయినా నేను మర్చిపోను. నువ్వు పెట్టిన ప్రతి ట్వీట్‌కు నేను ఇచ్చిన సమాధానం గుర్తు ఉంది కదా అంటూ ప్రశ్నించారు.