సమ్మె చట్టవిరుద్ధమని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పింది : సజ్జల

అమరావతి : ఏపీ పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు గతంలోనే గుర్తు చేసిందని పేర్కొన్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటున్న ప్రభుత్వానికి ప్రస్తుతం పరిస్థితి అర్థంకావడం లేదని అన్నారు. ఉద్యోగులతో చర్చించేందుకు అవసరమైతే నాలుగు మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు మేలు చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తుందని అన్నారు. భవిష్యత్తు లోనూ ఉద్యోగులకు మంచి చేస్తుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా మెరుగైన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల నష్టం జరుగుతుందని భావిస్తే ప్రభుత్వంతో మరోసారి చర్యలు జరిపి పరిష్కరించుకోవచ్చుకదాని సూచించారు.
గత మూడు రోజులుగా చర్చలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల రాక కోసం ఎదురుచూసామని అయినా ఉద్యోగులు రాలేదని అన్నారు. రేపు కూడా వారి కోసం ఎదురుచూపు చూస్తామని సజ్జల వెల్లడించారు. ఇప్పటికైన చర్చలకు రావాలని పీఆర్సీ సాధన సమితి నాయకులకు ఆయన సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

