Srisailam | శ్రీశైలంలో కన్నడిగుల సందడి.. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం..!
Srisailam | శ్రీశైల మహాక్షేత్రానికి ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు కాలినడకన తరలి రావడంతో క్షేత్ర వీధులు కిటకిటలాడుతున్నాయి.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో కాలినడకన రావడంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఆదివారం ఉదయం నుండి లింగ దర్శనం ఉండదని కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈవో లవన్న స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్దం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఏప్పటికప్పుడు వాటిపై శ్రద్ద కనబరచాలని అదికారులను ఈవో లవన్న ఆదేశించారు. భక్తులందరూ శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తిగా దర్శించుకునేందుకు తెల్లవారుజామున మూడు గంటలనుండి అర్దరాత్రి వరకు మూడు క్యూలైన్లలో ఉచిత, శ్రీఘ్ర, అతి శ్రీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

వృద్దమల్లికార్జునస్వామికి అభిషేకాలు, స్వామి అమ్మవార్ల నిత్యకళ్యాణం, వల్లిదేవసేన కళ్యాణం, ఆర్జిత సేవా కర్తలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన ఆశీర్వచన మండపంలోనే ఉంటుందని భక్తులందరూ సహకరించాలని కోరారు. ఆలయం తెరిచినప్పటి నుండి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదం అందుబాటులో ఉంచారు.

కాలినడక భక్తులకు మార్గమధ్యలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, మంచినీరందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. కాలి నడక భక్తులకు ప్రత్యేక కంకణాలను ఏర్పాటు చేసి శ్రీఘ్ర దర్శనం ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. అటవీ ప్రాంతం నుండి కాలినడకతో వచ్చే వారికి వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం దవాఖానలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

శ్రీశైల క్షేత్ర ఉగాది ఉత్సవాలకు లక్షలాదిగా తరలి వస్తున్న యాత్రికులు స్వామి అమ్మవార్లను దర్శించుకోగానే వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని ఈవో ఎస్ లవన్న కోరారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు దేవస్థానం వద్దే రాత్రి వేళ నిలిచిపోవడంతో తోటి యాత్రికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

శ్రీశైలంలో అన్నదానానికి విరాళాలు
శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం అందింది. ఆదివారం హైదరబాద్ వాసి వెంకట రమణ.. ఆలయ సహయ కార్యనిర్వహణాధికారి ఫణిధర్ ప్రసాద్‌కు రూ. లక్ష డీడీని అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదం, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

