AP News | వాగులో కొట్టుకుపోయిన కారు.. కాపాడాలని ఐదుగురు బాధితుల ఆక్రందనలు
AP News | ఏపీలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు ప్రవాహ వేగాన్ని గమనించకుండా కారును ముందుకు వెళ్లిన ఓ కుటుంబం వాగులో చిక్కుకుంది.
అమరావతి : ఏపీలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు ప్రవాహ వేగాన్ని గమనించకుండా కారును ముందుకు వెళ్లిన ఓ కుటుంబం వాగులో చిక్కుకుంది. ఏలూరు జిల్లా (Eluru district) వేలేరుపాడు మండలం కోయమాదరం, విప్పలకుంపు గ్రామాల మధ్య ఉన్న లోతువాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.
అశ్వారావుపేట నుంచి వేలేరుపాడుకు కారు డ్రైవర్ రామారావు, జ్యోతి(50), గడ్డం సాయికుమారి(30), గడ్డం కుందన కుమార్(11), గడ్డం జగదీష్‌కుమార్ (8) మొత్తం ఐదుగురు బయలు దేరారు. లోతువాగు వద్ద ప్రవాహవేగాన్ని గమనించకుండా డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. వాగుమధ్యలో ఉన్న చెట్ల పొదల్లో కారు చిక్కుకుపోవడంతో వారు కారు నుంచి బయటకు వచ్చారు.
అక్కడి నుంచి హాహాకారాలు చేయడంతో సమీపంలో ఉన్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల కోసం ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు. వాగులో భారీ నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న సీఎంవో కార్యాలయం ఘటనపై ఆరా తీసింది. వెంటనే బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఘటనా స్థలానికి హెలికాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృంధాలను పంపించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
Read more :
Abscond | ప్రకాశం జిల్లాలో రిమాండ్ ఖైదీ పరారీ.. విస్తృతంగా పోలీసుల గాలింపు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

