ఇరువర్గాల ఆందోళనలతో ఏయూ వద్ద ఉద్రిక్తత..144 సెక్షన్ విధింపు
au tension| విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పలు అక్రమాలు, అవినితీ ఆరోపణకు సంబంధించి న్యాయం చేయాలంటూ ఈ రోజు తలపెట్టిన చలో
అమరావతి: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పలు అక్రమాలు, అవినితీ ఆరోపణకు సంబంధించి న్యాయం చేయాలంటూ ఈ రోజు తలపెట్టిన చలో ఏయూ కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ పూర్వ విద్యార్థుల సంఘం పిలుపు మేరకు చలో ఏయూ కు పిలుపునివ్వగా మరో వర్గం దీన్ని వ్యతిరేకిస్తు ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా రెండు వర్గాలకు అనుమతి నిరాకరించి ఆంధ్ర వర్సిటీ, పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఆంధ్రా వర్సిటీ ఇన్, అవుట్ గేట్ల వద్ద పోలీసుల మోహరించి గుర్తింపు కార్డులు ఉన్న విద్యార్థులు, సిబ్బందికే లోపలికి అనుమతిస్తున్నారు. జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద టీఎన్ఎస్ఎఫ్ నాయకుల అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఆందోళనలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు, జనసేన నాయకులు పీలా రామకృష్ణ, తాతారావు, గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు పుచ్చా విజయకుమార్, మొల్లి పెంటిరాజు సీపీఎం నాయకులు సుబ్బారావు, మాటూరి చిన్నారావు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ హర్షకుమార్, తదితరులను గృహ నిర్బంధం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

