Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
AP Election | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు (Local body Elections ) తాత్కాలిక బ్రేక్ (Temporary break ) వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు ఎదురయ్యాయన్న ఫిర్యాదులపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తాజా ఉత్తర్వులు వెలువరించింది.
హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న 19 ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించినప్పటికీ, తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ వరకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకూడదని ఎస్ఈసీ అధికారులను ఆదేశించింది. హింస, శాంతిభద్రతల సమస్యల కారణంగా నామినేషన్లు దాఖ చేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులను ఆధారాలతో సహా పరిశీలించాలని సూచించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
Vijay Deverakonda | రాత్రి 11.40కి అల్లు అర్జున్‌కి విజయ్ దేవరకొండ కాల్.. అసలు కారణం ఇదే!
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

