Nagarjuna Yadav | వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున అరెస్టు.. గుంటూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు!
Nagarjuna Yadav | వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ పోలీసులం అని కుటుంబసభ్యులకు చెప్పారు.
Nagarjuna Yadav | వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ పోలీసులం అని కుటుంబసభ్యులకు చెప్పారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్‌ను పోలీసులు తీసుకెళ్లారు. దీనిపై అడగ్గా.. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నాగార్జున యాదవ్‌ను అరెస్టు చేశారని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

Nagarjuna Yadav1
ఇటీవల ఓ లైవ్ డిబేట్లో నాగార్జున యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఒక జొమాటో డెలివరీ బాయ్ అని ఎద్దేవా చేశారు. ఆయనకు ఒక ప్రభుత్వ జీవో చదవడం కూడా రాదని.. కనీసం ఎమ్మెల్యేగా కూడా పనికిరాడని విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే నాగార్జున యాదవ్‌ను అరెస్టు చేసి ఉంటారని తెలుస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

