అమరావతి : కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) కుటుంబమేనని టీడీపీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ( Bhumireddy Ramgopal Reddy) సంచలన వ్యాఖ్యలు ( Sensational Comments ) చేశారు. జగన్ తాత, ముత్తాతలు దేశానికి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఒకవైపు స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతుంటే బ్రిటీష్ వాళ్లకు మద్దతుగా వైఎస్ కుటుంబం ఆహారం సరఫరా చేసిందని విమర్శించారు. బ్రిటీష్ వాళ్ల మన్ననలు పొంది భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసింది వైఎస్ కుటంబమని పేర్కొన్నారు. భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేసే మీరే దేశ భక్తులమంటూ , రాష్ట్ర అభివృద్ధి కారకులమంటూ గొప్పలు చెప్పుకోవడం దారుణమని అన్నారు.
మద్రాస్ హైకోర్టుపై జపాన్ బాంబు దాడిలో గాయపడి ప్రాణ భయంతో మిలటరీ నుంచి పారిపోలేదా అంటూ నిలదీశారు. స్వాతంత్య్రం వచ్చాక వ్యాపారులపై రాజారెడ్డి అరాచకాలు అందరికీ తెలిసిందేనని వెల్లడించారు. కడప వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జగన్ తాత, పెద్దనాన్నతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైందని గుర్తు చేశారు.
ప్రత్యర్థుల ఆస్తులను చీని చెట్లను విధ్వంసం చేసే సంస్కృతిని ప్రారంభించింది ఆ కుటుంబమేనని వెల్లడించారు. గతంలో ఏ వ్యాపారం లేని జగన్ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఏనాడు ఫ్యాక్షన్ బాధితుడు కాదని, ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించిన నాయకుడని అన్నారు.