Gopal Yadav | చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ నేత.. జగన్‌కు సారీ చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్
Gopal Yadav | ఏలూరు ఎంపీ టికెట్ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ నేత పుట్టా మహేశ్ యాదవ్‌కు టికెట్ కేటాయించడం పట్ల గోరుముచ్చు గోపాల్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ సీటు తనకే వస్తుందన్న ధీమాతో గోపాల్ యాదవ్ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు.
Gopal Yadav | ఏలూరు ఎంపీ టికెట్ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ నేత పుట్టా మహేశ్ యాదవ్‌కు టికెట్ కేటాయించడం పట్ల గోరుముచ్చు గోపాల్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ సీటు తనకే వస్తుందన్న ధీమాతో గోపాల్ యాదవ్ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో టికెట్‌ను వేరే వాళ్లకు ఇవ్వడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తన కోపాన్ని వెల్లగక్కారు. అదే సమయంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పైన ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఒక సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు.
విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ.. సుఖసంతోషాలతో ఉన్న తనను రాజకీయాల్లోకి పిలిచింది మీరే.. ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పింది మీరే.. కానీ ఎంతో భరోసా ఇచ్చారు. దీంతో ఏడాది కాలంగా అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రచారం చేసుకున్నా. ఇంటింటికీ తిరిగాను. కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడం బాధగా ఉందని గోపాల్ యాదవ్‌లో పేర్కొన్నారు. టీడీపీలో బీసీలు అంటే యనమల, పుట్టా సుధాకర్ కుటుంబాలేనా అని చంద్రబాబుపై గోపాల్ యాదవ్ మండిపడ్డారు. రాజకీయం వారి గడప దాటకూడదా అని ప్రశ్నించారు. పార్టీపరంగా మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని ఆ వీడియోలో గోపాల్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. పార్టీపరంగా, రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప.. జగన్‌పై ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. మీ ధైర్యాన్ని మెచ్చుకుంటానని అన్నారు. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో రిజర్వ్డ్ స్థానాలను తీసేస్తే.. మిగిలిన 19 స్థానాల్లో 11 చోట్ల బీసీలకే జగన్ అవకాశం ఇచ్చారని ప్రశంసించారు. మీరు తీసుకున్న నిర్ణయంతో మీకు అభిమానిగా మారిపోయానని అన్నారు. అదే టీడీపీని చూస్తే వైజాగ్ నుంచి నెల్లూరు వరకు ఓసీలకే సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. ఏలూరు టికెట్ తనకు ఇస్తానని చెప్పి.. కడపకు చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి విమర్శలు చేయాలని అనుకోవడం లేదని.. దీన్ని వాళ్ల విజ్ఞతకే వదలేస్తున్నానని చెప్పారు. కష్టనష్టాలు అన్నింటినీ భరించానని.. ఎవరి మద్దతు లేకుండానే ఈస్థాయికి వచ్చానని తెలిపారు.
రాజకీయ చదరంగంలో మోసపోయిన మన బీసీ సోదరుడు గోపాల్ యాదవ్ ఆత్మీయ సమ్మేళనం
స్థలం :- కామవరపుకోట SR బంక్ చెక్ పోస్ట్ వద్ద
సమయం :- ఆదివారం (24 మార్చ్) సాయంత్రం 5 గంటలు#GopalYadavGorumutchu #GopalYadav #GopalYadavEluru pic.twitter.com/WeAuL1HqCD
— Gopal Yadav Gorumutchu (@GopalYadavTDP) March 22, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

