Supreme Court | చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి 19కి వాయిదా
Supreme Court | స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి 19కి వాయిదా పడింది.
అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి 19కి వాయిదా పడింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రాకపోవడంతో బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court ) వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ఎదుట కేసు విచారణకు రాగా చంద్రబాబు(Chandra Babu) తరఫున సీనియర్ న్యాయవాది హరీష్‌సాల్వే వాదించగా ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది వాదించారు.
17 ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని హరీష్‌సాల్వే అభ్యర్థించారు. ఇందుకు గాను కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామని ఆయన వెల్లడించారు. స్కిల్ కేసు 17 ఏ తీర్పుతో ముడిపడి ఉందని హరీష్‌సాల్వే చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.
ఈ విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న ధర్మాసనం వెల్లడించగా తేదీ ఖరారు చేయాలని సాల్వే కోరారు. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. జనవరి 19లోగా కౌంటర్ వేయాలని చంద్రబాబు తరుఫు న్యాయవాదికి, ఆ కౌంటర్‌కు రిజాయిండర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

