శ్రీవారి ఆదాయం రూ. 2.94 కోట్లు..
tirumala| తిరుమలలోని శ్రీవారి భక్తుల తాకిడి పెరుగుతుంది. నిన్న శ్రీవారిని 34,562 మంది దర్శించుకున్నారు. 14,689 మంది తలనీలాలు
తిరుమల : తిరుమలలోని శ్రీవారి భక్తుల తాకిడి పెరుగుతుంది. నిన్న శ్రీవారిని 34,562 మంది దర్శించుకున్నారు. 14,689 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్ కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.94 కోట్లు వచ్చిందని వివరించారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయనున్నారు. కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్ టికెట్ల జారీని ఎల్లుండి నుంచి పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.
16వ తేదీ దర్శనం కోసం 15న ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేస్తుంది. రేపటి నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది.
రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తున్నది. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లను నెలకొల్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

