శ్రీశైల భ్రమరాంభికకు రేపు కుంభోత్సవం..
రేపు కుంభోత్సవం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు.

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయ దర్శనానికి నిబంధనలు కఠినతరం చేశామని పేర్కొన్నారు.
కుంభోత్సవానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు.
కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రాత:కాల పూజల అనంతరం కొబ్బరికాయలు, గుమ్మడికాయల సమర్పించనున్నారు.
కోటమ్మవారి పూజలు, అన్నాభిషేకం, కుంభహారతి తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కుంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హాజరుకానున్నారు.
పరిమిత సంఖ్యలో స్థానిక భక్తులకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సాయంత్రం ఆలయం దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు.
కుంభోత్సవం ఉండటంతో రేపు ఉభయ దేవాలయాల్లో జరిగే ఆర్జిత సేవలు, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
జంతు, పక్షి బలి పూర్తిగా నిషిద్ధం..
క్షేత్ర పరిధిలో జంతు, పక్షులను బలి ఇవ్వడం.. మద్యం, మాంసాహారాలను వండివార్చడం నేరమని ఈఓ హెచ్చరించారు.
టోల్గేట్ వద్ద కోళ్లు, మేకలతో క్షేత్ర ప్రవేశం చేసేందుకు ప్రయత్నించిన వారిని ఆయన అడ్డుకున్నారు. దేవాదాయ చట్టాన్ని అతిక్రమించి జంతు బలి ఇచ్చేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆలయ పరిసరాలు మాడవీధులు, ప్రధాన ద్వారాలు, పంచమఠాలు, బయలు వీరభద్రస్వామి, మహిషాశురమర్ధినీ, సుంకాలమ్మ ఆలయం, సాక్షి గణపతి, టోల్గేట్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి తెలిపారు.
కోళ్లు, మేకలు, మద్యం, మాంసాహారం తీసుకువచ్చిన ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

