Srisailam | శ్రీశైల నందీశునికి పంచామృతాభిషేకాలు
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజాధికాలను నిర్వహిస్తున్నట్లు దేవస్ధాన ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని

శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజాధికాలను నిర్వహిస్తున్నట్లు దేవస్ధాన ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. దీనివలన శత్రుభాదలు, గ్రహపీడలతోపాటు దృష్టి లోపాలు దూరమవుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు.
సంతాన ప్రాప్తి కలుగని దంపతులు కుమారస్వామిని పూజించాలని అన్నారు. శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రునికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆరుబయట ఆలయంలో క్షేత్రపాలకుడిగా భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి, విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు.
అనంతరం సంధ్యా సమయంలో నంది మండపంలో కొలువైన నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోవుండే ప్రజలు సుఖసంతోషాలతో భాసిల్లాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు.
పంచామృతాలు ఫలోదకాలతోపాటు హరిద్రోదకం, భస్మోదకం, కుంకుమోదకం, గంధోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, సువర్ణోదకం, పుష్పోదకం మరియు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేస్తు పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. తరువాత నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యం సమర్పించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

