Sri Krishna Janmashtami | తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
Sri Krishna Janmashtami | తిరుమల (Tirumala) లో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami ) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
తిరుమల : తిరుమల (Tirumala) లో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami ) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి పంచాభిషేకాలు, ఉట్లోత్సం నిర్వహించారు.

ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, వీజివో బాలి రెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుంచి 10 గంటల వరకు శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం (Tirumanjanam), ద్వాదశ ఆరాధన నిర్వహించే కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానాన్ని చేపడుతామని వివరించారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం, శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ (TTD) రద్దు చేసిందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

