శ్రీశైలంలో పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజలు

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు మంగళవారం ప్రత్యేక పూజాధికాలను నిర్వహించినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు. అదే విధంగా శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రునికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్తోక్తంగా జరిపించారు. ఆరుబయట ఆలయంలో క్షేత్రపాలకుడిగా భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు. అనంతరం వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు అభిషేకార్చనలు, నైవేద్యాలు సమర్పించారు.
కొవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోయి ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు, అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతోపాటు హరి ద్రోదకం, భస్మోదకం, కుంకుమోదకం, గంధోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, సువర్ణోదకం, పుష్పోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకాలు చేశారు. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు బసవన్నకు సమర్పించారు.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

