హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని కడప జైలులో బెదిరింపులకు గురిచేయడంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను విచారణ అధికారిగా నియమించింది.
శుక్రవారం కడప జైలులో దస్తగిరిని విచారించనున్నారు. అనంతరం చైతన్యరెడ్డి, ప్రకాశారెడ్డిని విచారించే అవకాశం ఉందని సమాచారం.