TTD Covid Rules | తిరుమల దర్శనానికి వెళ్లాలంటే ఇవి కచ్చితం.. స్పష్టం చేసిన టీటీడీ
సర్వదర్శనం టోకెన్లు| తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను సెప్టెంబర్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను సెప్టెంబర్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపి వేస్తామన్నారు.
సర్వదర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు గుమికూడుతుండటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని.. నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు. కొవిడ్ నియంత్రణకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

