Home
Andhrapradesh-news
Road Accident Fatal Road Accident Three Pedestrians Killed Five Others Injured
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పాదచారులు మృతి.. మరో ఐదుగురికి గాయాలు
Road Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పాదచారులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు్ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పాదచారులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిని బొలెరో వాహనం ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో పాదచారులు ముగ్గురు మరణించగా, కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బొలెరో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

