ఏపీ బీజేపీకి ఝలక్.. గుడ్‌బై చెప్పిన రావెల కిశోర్ బాబు
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నానని, పార్టీ నేతలు అన్యథా భావించవద్దని ఆయన తన రాజీనామా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల… కొన్ని నెలల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా లేరు.
కిశోర్ బాబు ఐఆర్ ఎస్ అధికారిగా పనిచేశారు. 2014 లో టీడీపీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గెలుపొందారు. గెలవడమే ఆలస్యం… మంత్రి పదవి కూడా లభించింది. చంద్రబాబు కేబినెట్లో సాంఘిక, గిరిజన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పోయింది.
2019 ఎన్నికల సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పేసి, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరారు. సారి కూడా ప్రత్తిపాడు నుంచే జనసేన పక్షాన బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ… సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరారు. కొన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- ap bjp
- BJP
- ravela kishore babu
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

