మణిపాల్‌లో ఫ్రీగా అరుదైన చికిత్స…

విజయవాడ,9మే : మణిపాల్ హాస్పిటల్, విజయవాడ విజయవంతంగా 20ఏండ్ల బీకామ్ విద్యార్థి ఈశ్వర్ సాయి గణేష్‌కు హప్లోఐడెంటికల్ బోన్‌మారో మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. సాధారణంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు కుటుంబ దాత నుంచి పూర్తిగా సరిపోలిన హెచ్ఎల్ఏకు బదులుగా సగం సరిపోలిన హ్యూమన్ ల్యుకోసైట్ యాంటీజెన్ (హెచ్ఎల్ఏ)ను తల్లిదండ్రులు లేదంటే తోడబుట్టిన వారి నుంచి సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా మణిపాల్ హాస్పిటల్ నిలిచింది.
ఈ మార్పిడి శస్త్రచికిత్స గురించి క్యాన్సర్ వైద్య , మూలకణ మార్పిడి నిపుణులు డాక్టర్ మాధవ్ దంతాల మాట్లాడుతూ ‘‘ఈ రోగికి 2016లో టీ–లింపోబ్లాస్టిక్ లింఫోమాను గుర్తించడం జరిగింది. దీనికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అతను చికిత్స తీసుకున్నాడు. ఈ రోగికి 2019లో అంటే చికిత్స ముగిసిన ఆరు నెలల కాలంలోనే మరలా వ్యాధి బయటపడింది. ఈ రోగిని ఆస్పత్రిలో 20 జనవరి 2021లో చేర్చారు. అక్కడ ఆయనకు వ్యాధిని నియంత్రించడం కోసం కీమోథెరఫీ చికిత్సను అందించారు. దీనికి అతని జబ్బు బాగా తగ్గింది. ఒకసారి వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తరువాత మేము హప్లోఐడెంటికల్ (సగం –సరిపోలిన) మూలకణ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. తద్వారా ఈ రోగిలో మరలా ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఉండవు. ఈ చికిత్స కోసం ఈ రోగి తన తండ్రి కోయ శ్రీనివాసరావు నుంచి స్టెమ్ సెల్‌ను పొందారు’’ అని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

