రిషికేశ్ చేరిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు

అమరావతి : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ బయల్దేరి వెళ్ళారు. శనివారం విశాఖ విమానాశ్రయం నుండి డెహ్రాడూన్ బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మర్గం ద్వారా రిషికేశ్ చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేశ్ వెళ్ళిన పీఠాధిపతులు అక్కడి గంగాతీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబరు నెలాఖరు వరకు బస చేస్తారు. రిషికేశ్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతిఏటా తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబరు 20వ తేదీ వరకు కొనసాగనుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి ప్రత్యేక విమానంలో రిషికేశ్ వెళ్లారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

