Vidadala Rajini | ఏపీలో మాజీ మంత్రిపై పోలీసుల దౌర్జన్యం.. చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత
Vidadala Rajini | ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్లు(Local body nominations) కొద్ది రోజులుగా యుద్ధాన్ని తలపిస్తున్నాయి.
Vidadala Rajini | ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్లు(Local body nominations) కొద్ది రోజులుగా యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ(YCP) అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎక్కడికక్కడ బలవంతంగా అడ్డుకుంటున్నారు. తాజాగా చిలకలూరిపేటలో(Chilakaluripeta) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి విడదల రజినీని పోలీసులు కింద పడేశారు. గత మూడు రోజులుగా ఆమెను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నేడు ఆమెపై పోలీసుల దౌర్జన్యం చేయడం స్థానికంగా కలకలం రేపింది. రజినీని కలిసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ రాకుండా పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో ఎడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి పందుల బుల్లబ్బాయిని నామినేషన్ దాఖలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలోనే తనను కలిసేందుకు వచ్చిన బుల్లబ్బాయిని పరామర్శించేందుకు ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ ప్రియాంక మాజీ మంత్రిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఎస్ఐ ప్రియాంక విడదల రజినీపై దౌర్జన్యానికి దిగారు. తోసేయడంతో ఆమె కింద పడిపోయారు. మాజీ మంత్రి ఇంట్లోనే పోలీసుల దౌర్జన్యపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
🚨 బ్రేకింగ్
చిలకలూరిపేటలో పోలీసుల దౌర్జన్యం
మాజీ మంత్రి విడదల రజినీని నెట్టేసిన ఎస్ఐ ప్రియాంక
ఎస్ఐ ప్రియాంక నెట్టేయడంతో కిందపడిపోయిన విడదల రజిని https://t.co/hm0ciI6RcF
— Telugu Feed (@Telugufeedsite) October 23, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

