అమరావతి : ముంబై సినీనటి (Mumbai film actress) కాదంబరి జత్వాని కేసులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత(AP Minister Anitha ) స్పష్టం చేశారు . ఈ కేసుపై చట్టబద్దంగానే దర్యాప్తు జరుగుతుందని, తగిన ఆధారాలు ఉండటం వల్లే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెన్షన్ చేశామని వెల్లడించారు.
విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు పడవలు వెలికితీత పనులను ఇరిగేషన్‌శాఖ మంత్రి రామానాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేసులో ఐపీఎస్(IPS Officers) అధికారులను బలి చేశారన్న వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. బలి చేయడం కాదని మహిళకు న్యాయం చేయడమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బలైన వారు చాలా మంది ఉన్నారని విమర్శించారు. విచారణలో ఎంత మంది పేర్లు వచ్చినా వారందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
250 టన్నుల మూడు బోట్లను ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) కి వదిలి దెబ్బతీసేందుకు కుట్ర పన్నిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు. వైసీపీ మాఫియాలను ఎన్డీయే ప్రభుత్వం అడ్డుగా ఉండడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే, ఏపీ ప్రజలపై పగబట్టి వారి జీవితాలతో ఆడుకోవడానికి బోట్లను వదిలారని ఆరోపించారు.