నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు
ఎంపీ రఘురామకృష్ణరాజు | నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని

హైదరాబాద్ : నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు, ఏపీ సీఐడీ పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 124 ఐపీసీ -ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతోనే ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది.
ఎన్నో ఏళ్లగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న జువారి సిమెంట్, అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రధాని నరేంద్ర మోదీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సరైన కారణాలు చూపకుండా పరిశ్రమలు మూసివేయాలనడం రాష్ట్ర ప్రభుత్వ క్రూరమైన చర్యగా అభిప్రాయపడ్డారు. పరిశ్రమలపై ఇలాంటి చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలు భయపడుతున్నాయని.. జగన్ సర్కార్ తీరును ప్రధానికి వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

