Chicken Pakodi | ప్రాణం తీసిన చికన్ పకోడీ లొల్లి.. శ్రీకాకుళంలో దారుణం
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. చికెన్ పకోడీ (Chicken Pakodi) వివాదం ఒక వ్యక్తి ప్రణాలు తీసుకున్నది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికన్ పకోడీ లేదన్నాడని హోటల్ యజమానిని పీకకోసి చంపేశాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు రాత్రి పూటుగా మద్యం సేవించాడు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. చికెన్ పకోడీ (Chicken Pakodi) వివాదం ఒక వ్యక్తి ప్రణాలు తీసుకున్నది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికన్ పకోడీ లేదన్నాడని హోటల్ యజమానిని పీకకోసి చంపేశాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు రాత్రి పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సమీపంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళ్లిన అతడు చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే షాపు యజమాని శంకర్ లేదని చెప్పాడు. దీంతో తనకు ఎట్టి పరిస్థితుల్లో చికెన్ పకోడీ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు.
లేదని చెప్పినా వినకుండా షాపు తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్పైకి దూసుకొచ్చాడు. అతని పీక నొక్కి కింద పడేసే ప్రయత్నం చేశాడు. దీంతో అప్పటికే మద్యం సేవించి ఉన్న శంకర్ కూడా పక్కనే ఉన్న సుత్తిని తీసి మిన్నారావు తలపై బలంగా కొట్టాడు. పక్కనే ఉన్న కత్తిని తీసి మిన్నారావు పీక కోశాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుకు అవతల వైపు ఉన్న కాలువలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

