Muncipal workers Strike | ఏపీలో 12వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె.. మరోదఫా చర్చలకు ప్రభుత్వం ఆహ్వానం
Muncipal workers Strike | తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు(Sanitaion Workers) చేపట్టిన సమ్మె (Stirke) 12వ రోజుకు చేరుకుంది .
ఆహ్వానం : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు(Sanitaion Workers) చేపట్టిన సమ్మె (Stirke) 12వ రోజుకు చేరుకుంది . సమ్మెను ఉధృతం చేయడంలో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయాల ముట్టడికి యత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్టు (Arrest ) చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసనకు వెళ్తు్ండగా వారిని ముందుగానే పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.
ఒంగోలులో ప్రైవేటు కార్మికులతో పనులు చేయిస్తుండగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 12 రోజులుగా కార్మికుల సమ్మెతో జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను రంగంలోకి దిగిన ప్రభుత్వం ఇప్పటికే కార్మిక సంఘ నాయకులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి .
శనివారం సాయంత్రం మరో దఫా చర్చలు జరిపేందుకు మంత్రులు బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) , ఆదిమూలపు సురేష్ (Suresh) కార్మిక సంఘాల నాయకులను ఆహ్వానించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

