ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపు

అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. 11 నగరపాలికలు,70 పురపాలికల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 71 పురపాలికల్లో ఎన్నికలు జరిగినప్పటికి హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఏలూరు నగరపాలికలో ఓట్ల లెక్కింపును ఈసీ నిలిపివేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నగరపాలికల్లో ఓట్ల లెక్కింపు కోసం 2,204 టేబుళ్లు, పురపాలికలు, నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను మొత్తం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నగరపాలికల్లో ఓట్ల లెక్కింపు పర్యవేక్షణకు 2,376 మంది సూపర్వైజర్లను, 7,412 మంది లెక్కింపు సిబ్బందిని నియమించారు. పురపాలికల్లో 1,941 మంది సూపర్వైజర్లను.. 5,195 మంది లెక్కింపు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. లెక్కింపు కేంద్రాల వద్ద 20,419 పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారని పేర్కొంది. 1,134 మంది ఇతర భద్రతా సిబ్బందిని నియమించినట్లు తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

