హామీలు నెరవేర్చాలి : ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ వరుస లేఖలు
వరుస లేఖలు | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. బుధవారం ఆయన సీఎంకు ఏడో లేఖ రాశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. బుధవారం ఆయన సీఎంకు ఏడో లేఖ రాశారు. రైతు భరోసా అంశంపై లేఖలో ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున వైసీపీకి అండగా నిలిచారని, వారికి ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రూ. 12,500ల నుంచి 13500కు పెంచింది. పెంచిన మొత్తంతోపాటు కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు కలిసి మొత్తం 19,500 ఒకేసారి చెల్లించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎం జగన్‌ను ఆయన కోరారు. ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు వెంటనే అమలు చేయాలని రఘురామ నిన్న ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

