అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారాలోకేష్(Nara Lokesh) చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే(Mla) , మాజీ మంత్రి అనిల్ కుమార్(Anil Kumar) తీవ్రంగా ఖండించారు. మంత్రిగా తాను అక్రమంగా వెయ్యికోట్లు సంపాదించాడని నెల్లూరు పర్యటనలో లోకేష్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ తనకు వెయ్యికోట్లు ఆస్తి సంపాదించినట్లు నిరూపించే దమ్ము, ధైర్యం లేదని మండిపడ్డారు.
నెల్లూరు జిల్లాలో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే ఒక్క రూపాయి తన వద్ద ఉన్నట్టు నిరూపించినా దేనికైనా సిద్ధమేనని సవాలు చేశారు. తాను నమ్మే వేంకటేశ్వరస్వామి చెంతనైన ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ లోకేష్‌కు సవాలు విసిరారు. తన పర్యటనలో లోకేష్ స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై బట్టకాల్చి మీద వేయడం , తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.