కడప పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదు
గని యజమానిపై కేసు | కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో జరిగిన పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి లేకుండా గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గనులశాఖ విచారణలో గుర్తించి బాధ్యుడిపై కేసు నమోదుకు ఆదేశించింది.

అమరావతి : కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో జరిగిన పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి లేకుండా గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గనులశాఖ విచారణలో గుర్తించి బాధ్యుడిపై కేసు నమోదుకు ఆదేశించింది.
పర్యావరణ అనుమతులు లేకపోవడంతో గతేడాది సెప్టెంబర్లోనే ఇక్కడ పనులు నిలిపివేసినట్లు గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు. గనిలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని గనులశాఖ డైరెక్టర్ మధ్యాహ్నం పోలీసులతో కలిసి పరిశీలించారు.
పేలుళ్లు జరిపేందుకు ఇవాళ వేంపల్లి నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మామిళ్లపల్లెలో సుమారు30 హెక్టార్లలో ముగ్గురాయి గని విస్తరించి ఉంది.
గనిలో పేలుళ్లు జరిపేందుకు తీసుకువచ్చిన జిలెటిన్స్టిక్స్ను ఈ ఉదయం వాహనం నుంచి కూలీలు
అన్లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి 10 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

