ఇద్దరు భార్యల్ని పోషించలేక.. వ్యక్తి ఆత్మహత్య
Man suicide: ఇద్దర్ని పెండ్లాడి.. వారిని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకున్నది. మృతుడు సాకే నాగేంద్ర అనంతపురం పట్టణంలోని...

(Man suicide) అనంతపురం: ఇద్దర్ని పెండ్లాడి.. వారిని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకున్నది. మృతుడు సాకే నాగేంద్ర అనంతపురం పట్టణంలోని నవోదయ కాలనీలో నివసిస్తూ.. ఓ డ్రిప్ కంపెనీలో జిల్లా కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు భార్యలను పోషించే స్థోమత లేక దిగాలు పడిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మూడేండ్ల క్రితం బదిలీపై చిత్తూరుకు వెళ్లిన సమయంలో అక్కడ దుర్గా భవాని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సహజీవనానికి దారితీసింది. కొన్ని నెలల తర్వా అనంతపురానికి తిరిగి వచ్చిన నాగేంద్ర.. మరికొన్నాళ్లకు దుర్గా భవానిని అనంతపురం తీసుకొచ్చి హౌసింగ్ బోర్డు కాలనీలో కాపురం పెట్టాడు. ఆదివారం దుర్గా భవానీ ఇంటికి వచ్చిన నాగేంద్ర.. బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవటంతో దుర్గాభవాని.. ఇంటికి సమీపంలో ఉండే నాగేంద్ర స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే అతను రెండో పట్టణ పోలీసులకు చెప్పాడు. దుర్గాభవానీ ఇంటికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే నాగేంద్ర ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాలను పోషించడం భారంగా మారినందునే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని, విచారణలో అసలు విషయాలు తేలుతాయని పోలీసులు చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

